అయ్యప్ప దేవుడే కాదు .. హిందువులు పూజలు చేస్తుంది వ్యర్ధం…

Culture National

అయ్యప్ప దేవుడు అంటూ ఎలా హిందువులు పుజిస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు, అయ్యప్ప మందిరం అంత హిందువుల సృష్టి తమతమ అనుకూల నినాదాల కోసం అయ్యప్ప మందిరం నిర్మించారు అంటూ వ్యాఖ్యానించిన సినిమా నటుడు ప్రకాష్ రాజ్. అయ్యప్ప అనే పేరు ముస్లిమ్స్ నుండి వచ్చినట్లు అయ్యప్ప సెక్యులర్ దేవుడు అంటూ వెల్లడించిన ప్రకాస్ రాజ్

నిత్యం సంచలన వ్యాఖ్యలతో నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడే ఈ విలక్షణ నటుడు… ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న శబరిమల వివాదం గురించి తనదైన శైలిలో స్పందించారు. కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప దేవాలయం శబరిమలలోకి ‘అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం’ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ దగ్గర్నుంచి అక్కడ వాతావరణం మారిపోయింది.

ఈ తీర్పును వ్యతిరేకిస్తూ చాలామంది ‘సేవ్ శబరిమల’ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన మహిళలను, ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేరళ సర్కార్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆలయ పాలక మండలితో పాటు అయ్యప్ప భక్తులు, మహిళా భక్తులు కూడా సుప్రీం తీర్పును, ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో శబరిమలలో యుద్ధవాతావరణం నెలకొంది.

శబరిమల వివాదం గురించి స్పందించిన ప్రకాశ్ రాజ్… ‘దైవదర్శనానికి మహిళలను అనుమతించిన భక్తులు, నిజంగా భక్తులే కారు, నా సన్నిధికి మహిళలు రాకూడదు అనుకునే అయ్యప్ప దేవుడే కాదు…’ అంటూ వ్యాఖ్యానించారు. స్త్రీ అంటే తల్లి. భూమిని కూడా తల్లితో పోల్చే గొప్ప సంస్కృతి మనది. మనకు జన్మనిచ్చేది, ప్రాణం పోసేదీ మహిళే. మరి అలాంటి మహిళలకు స్వామి సన్నిధానానికి ప్రవేశం కల్పించకపోవడం ఎందుకు? మహిళలను ప్రార్థించడానికి అనుమతించని మతం నా దృష్టిలో మతమే కాదు. దైవదర్శనానికి స్త్రీలను అనుమతించని భక్తులు, భక్తులే కారు. నా దగ్గరకు ఆడవాళ్లు రాకూడదనుకునే దేవుడు దేవుడే కాదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *