సంస్కృతి చదవకుండా విమర్శించావద్దు సంస్కృతి ఒక్కటే సత్యం అంటున్న ముస్లిం మహిళ

Culture National

సంస్క్రతి ఏ ఒక మతానికి ప్రాధాన్యత ఇవ్వదు ప్రపంచంలో సంస్క్రతి ఒకటే ప్రతి మతానికి ఒకటే అని బోధిస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన గ్రంధాన్ని ఎవరు అభ్యసించాకుండ విమర్శించకండి, సంస్కృతి మనకు అమ్మతో సమానం, అమ్మ మనకు ప్రాణం పోస్తుంది నాన్న మనకు దేహం ఇస్తారు, సంస్కృతి మనకు బ్రతుకుతెరువు ఇస్తుంది  సంస్కృత భాషకు హిందూ భాషగా ముద్ర ఉంది. ఆ ప్రాచీన భాషను దైవ భాషగా అభివర్ణిస్తుంటారు కొందరు. హిందువులకు సంబంధించినది మాత్రమే అన్నట్లు ఆ భాషపై వివక్ష కూడా ఉంది. అయితే.. ఆ భాష ఓ ఒక్కరికీ చెందినది కాదని, అది అందరిదీ అని చాటారు ఓ ముస్లిం మహిళ. ఆమే.. సల్మా మహ‌ఫూజ్. సంస్కృత భాషలో పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి ముస్లిం మహిళగా రికార్డు పొందిన ఆమె.. బనారస్ హిందూ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం 15 మంది విద్యార్థులకు సంస్కృత భాషలో గైడ్‌గా సల్మా వ్యవహరిస్తున్నారు. ఆమె హిందూ విద్యార్థులకే కాకుండా ముస్లిం విద్యార్థులకు కూడా మెలకువలు నేర్పిస్తున్నారు. ముస్లింగా సంస్కృత భాషపై పట్టు సాధించడంపై స్పందించాలని ఆమెను కోరగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ‘నేను కాంట్రవర్సీలను పట్టించుకోను. ఒక భాష అనేది ఒక మతానికి సంబంధించినది అని అనుకోను. సంస్కృత భాషలో పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి ముస్లిం మహిళను. నేను భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులను పఠించాను. అవి హజ్ యాత్రకు వెళ్లకుండా, నమాజ్ చేయకుండా, రోజా పాటించకుండా ఆపవు.

’ అని ఆమె చెప్పారు. విద్యతో మతానికి ముడిపెట్టకూడదని, భాషను భాషగానే చూడాల్సిన అవసరం ఉందని సల్మా అన్నారు. తాను ఆరో తరగతి ఉన్నంత వరకు పండిత్ అయోధ్య దాస్ అనే ఉపాధ్యాయుడి వద్ద సంస్కృత భాషను నేర్చుకున్నానని చెప్పారు. భాషను చాలా సులువుగా నేర్పించారని గుర్తుచేసుకున్నారు. ఈ భాష తన గౌరవాన్ని, తన వ్యక్తిత్వాన్ని రెట్టింపు చేసిందని సంస్కృత భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *