అమెరికాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన మోదీ .. జై హో

National

స్వాతంత్రానంతరము అమెరిక భారతీయులకు అనేక విధములుగా బ్లాక్మెయిల్ చేస్తూ తన రాజ్యాధికార హక్కులను తుంగలోకి తొక్కింది ఐతే ఇప్పుడు భారతదేశంలో బలమైన నాయకత్వం పరిపలిస్తుండటంతో అమెరిక దురుద్దేశంతో చేపడుతున్న బ్లాక్మెయిల్ రాజకీయాలు చెల్లవు అంటూ నరేంద్ర మోదీ అగ్రరాజ్యానికి భారతదేశ ప్రధాని ఒక గట్టి సంకేతాన్ని పంపించినట్లు ఉంది.

అమెరికాకు భారత్ ఝలక్ ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే అల్యూమినియం వస్తువుల మీద గత మార్చిలో సుంకాన్ని పెంచింది. దీంతో భారత్ కూడా అమెరికాకు షాక్ ఇస్తూ యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీని పెంచింది. అమెరికాలో ఉత్పత్తి చేసినవి లేదా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఈ దిగుమతి సుంకం వర్తిస్తుంది.

పెరిగిన ఇంపోర్ట్ డ్యూటీ జూన్ 16 నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద దిగుమతి సుంకం తగ్గించాల్సిందిగా అమెరికాను పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల సందర్భంగా కూడా ఈ చర్చ జరిగింది. కానీ, అగ్రరాజ్యం నుంచి ఎలాంటి సానకూల స్పందన రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *