అమ్మాయిలు బయటకి చెప్పని 8 విషయాలు ఇవే..తప్పక తెలుసుకోండి…

Opinion

ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా తెలుసుకోవడం సులభం కానీ ఆడవారి మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం.అంతేకాదు వారి మాటలకు అర్దాలను వెతకాలని ప్రయత్నించడం కంటే కష్టమైన పని మరొకటి ఉండదు.ఇక వారి మనసులో ఉన్నదాన్ని తెలుసుకోవడం పురుషుల వలన కాదని అధ్యయనాలే చెప్తున్నాయి.

ఆడవారి కళ్లలోకి సూటిగా చూసినప్పుడు మగవారి మెదడులో కొన్ని భాగాలు అంత చురుకుగా పని చేయకపోవడమే దానికి కారణమట.అబ్బాయి డబ్బున్నోడు అయితే చాలు అమ్మాయిలు పడిపోతారు అనుకుంటారు చాలామంది.కానీ అమ్మాయిలు డబ్బున్న అబ్బాయిల కంటే.మంచిగా మాట్లాడే అబ్బాయిలను ఇష్టపడతారు.

మరొక అబ్బాయితో మాట్లాడితే తట్టుకోలేరు అబ్బాయిలు జెలసీ ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తారు అమ్మాయిలు.అది వారిపై తమ ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు.కాబట్టి అమ్మాయి మరొకరితో మాట్లాడితే లేని పోని అనుమానాలకుపోకుండా తనకి మరింత దగ్గరవ్వండి.

క్లీన్ షేవ్ చేసుకున్న అబ్బాయిలకంటే గడ్డం ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు.ప్రేమించిన వాన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వారికి తెలియకుండానే వారి బాగోగులు తెలుసుకోవాలనుకుంటారు.ఇప్పుడు సోషల్ మీడియా దానికి బాగా హెల్ప్ చేస్తుంది. సోషల్ మీడియాలో అతని యాక్టివిటీస్ ని గమనిస్తుంటారు.

భార్య,భర్త కలిసే ఏకైక చోటు బెడ్రూం.అక్కడ వారు వేరే ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తే ఖచ్చితంగా మీ గురించి కాదు. అలాంటప్పుడు మీ మటుకు మీరుండకుండా,తన సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నించి,పరిష్కరించే దిశగా అడుగులేస్తే అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది.

ఆడవాళ్లు, మగవాళ్ల చూపులను భరించలేరనేది ఒప్పుకోవాల్సిన నిజం.కానీ ఎవడు పడితే వాడు చూస్తే ఒప్పుకోరేమో కాని వారిష్టపడిన వాడు మాత్రం తనని చూడాలని కోరుకుంటారు.డబ్బుకంటే ఎక్కువగా నిజాయితీకి ప్రాధాన్యమిస్తారు అమ్మాయిలు కాబట్టి నిజాయితీగా,హూందాగా ప్రయత్నించండి.

ఒకమ్మాయి శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడ్డం చాలా నేరంగా చూసే సమాజం మనది.కానీ తను అలా మాట్లాడుతుంటే ,ఆ మాటలను సపోర్టు చేసేవాడన్నా,విని లైట్ తీసుకునే వాడిని అమ్మాయిలు ఇష్టపడతారు. అంతేకానీ ఆడవాళ్లు కొన్ని హద్దుల్లో ఉండాలి అనుకునేవాన్ని అమ్మాయిలు ఇష్టపడరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *