79 ఏళ్లుగా తిండి, నీళ్లు లేకుండా బతికేస్తున్న బాబా

Opinion

ఒక్క రోజు తిండి లేకపోతేనే ఆకలితో కడుపు నకనకలాడుతుంది. కానీ, ఆయన గత 79 ఏళ్లుగా తిండి తినకుండా, నీళ్లు తాగకుండా బతికేస్తున్నారు. నమ్మ బుద్ధి కావడం లేదు కదూ. అయితే, మీరు తప్పకుండా ఆయన గురించి తెలుసుకోవాలి. గుజరాత్‌ మెహసానా జిల్లా చరోడ్ గ్రామానికి చెందిన 89 ఏళ్ల ప్రహ్లాద్ జానీకి ఆహారం, నీళ్లు అక్కర్లేదు.

కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఆయన బతికేస్తున్నారు. అయితే, అది ఎంతవరకు వాస్తవమని తెలుసుకోడానికి వైద్యులు, పరిశోధకులు ఆయనపై చేయని పరీక్ష లేదు.మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సైతం ప్రహ్లాద్‌పై పరీక్షలు చేయడం గమనార్హం.

ఆయన కేవలం శ్వాస మాత్రమే పీల్చుతూ ఎలా జీవిస్తున్నారని తెలుసుకునేందుకు కొంతమంది శాస్త్రవేత్తలు ఆయన ఆశ్రమంలోని మొక్కలపై కూడా పరిశోధనలు చేశారు. చివరికి ఎవరూ ఆయన రహస్యాన్ని కనుగోలేకపోయారు. ప్రహ్లాద్ అంబ మాతను కొలుస్తారు.

15 రోజుల పాటు పరీక్షలు..2010లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెనస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రహ్లాద్‌ను పూర్తిగా పరీక్షించారు. ఆయను 15 రోజులు పాటు ఒంటరిగా ఉంచి, చుట్టు కెమేరాలు పెట్టి ఆయన జీవన శైలిపై నిఘా పెట్టారు. అంతేగాక, వైద్య రంగంలో అందుబాటులో ఉన్న అల్ట్రాసౌండ్, ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్ వంటి అన్నిరకాల ఆధునిక పరికరాలతో ఆయన్ని పరీక్షించారు. చివరికి ఆయన సాధారణ వ్యక్తికాదని తెలుసుకున్నారు.

ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలు ఆయనలో ఉన్నాయని గుర్తించారు. అన్నేళ్లు తిండి, నీరు లేకుండా ఎలా జీవిస్తున్నారనే ప్రశ్నకు ప్రహ్లాద్ స్పందిస్తూ.. అది కేవలం ధ్యానంతోనే సాధ్యమైందని తెలిపారు. ఆయన శక్తి గురించి తెలిసి ఎంతో మంది భక్తులు, ప్రముఖులు ఆయన ఆశ్రమానికి తరలివస్తున్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండటం విశేషం.

100 కిమీలు నడిచినా అలసట రాదు..: తాను ఒక్క మెతుకు అన్నంగానీ, చుక్క నీటిని కూడా తాగనని ప్రహ్లాద్ తెలిపారు. కొన్నిసార్లు అడవుల్ల 100 నుంచి 200 కిమీల దూరం నడిచేస్తానని తెలిపారు. తనకు ఎలాంటి అలసట రాదని, చెమట పట్టదని చెప్పారు. రోజు తాను మూడు నుంచి 12 గంటల వరకు ధ్యాన ముద్రలో ఉంటానన్నారు.

అసాధారణ జీవితం.. ఒక మనిషి నీరు లేకుండా వారం రోజులు, తిండి లేకుండా కొన్ని నెలలు పాటు జీవించగలడు. కానీ, ఇలా ఏళ్ల తరబడి ఆహారం, నీరు లేకుండా బతకడం అసాధ్యమని వైద్య నిపుణులు తెలిపారు. ఆహారం, నీరు లేకపోతే శరీరంలోని అవయవాలు దెబ్బ తింటాయి. కొందరు తీవ్రంగా జబ్బు పడతారు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందన్నారు.

అయితే, ప్రహ్లద్‌లో మాత్రం అటువంటి ప్రతికూల పరిస్థితులేవీ వైద్యులకు కనిపించలేదు. ఏమీ తీసుకోకుండానే ఆయన ఇన్నాళ్లు ఆరోగ్యంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు.మహిళగా వస్త్రధారణ: తాను ఏడేళ్ల వయస్సులోనే రాజస్థాన్‌లోని తన కుటుంబాన్ని వదిలి అడవి బాట పట్టానని ప్రహ్లాద్ తెలిపారు.

11 ఏళ్ల వయస్సులో తాను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నానని, అంబా దేవతను ఆరాదించడం మొదలుపెట్టానన్నారు. ఆమె స్ఫూర్తితో తాను కూడా మహిళలా వస్త్రాధారణ చేసుకోవడం అలవరుచుకున్నానని తెలిపారు. ఆమెలాగే తాను ముక్కుకు రింగు, చేతికి గాజులు, తలలో పూలు ధరిస్తానని చెప్పారు. ఆమె వల్లే తాను తిండి, నీళ్లు లేకుండా ఇన్నాళ్లు బతకగలిగానని తెలిపారు.

ఆశ్రమానికి వచ్చే భక్తులు ప్రహ్లద్‌ను మాతాజీ లేదా చున్నివాలా మాతాజీ అని పిలుస్తారు.అదో మిస్టరీ: గుజారాత్‌లోని అంబాజీ ఆలయం సమీపంలోని ఓ గుహలో నివసిస్తున్న ప్రహ్లాద్.. తెల్లవారుజామునే నిద్రలేచి ధాన్యం చేస్తారు. ఆ తర్వాత ఆలయానికి వచ్చే భక్తులతో మాట్లాడి మళ్లీ ధ్యానం చేస్తారు. ప్రహ్లద్ గురించి తెలుసుకున్న వైద్యులు ఆయనపై ఎన్నో పరీక్షలు నిర్వహించారు.

తొలిసారిగా 2003లో అహ్మదాబాద్‌కు చెందిన న్యూరాలజీ కన్సాల్టెంట్ డాక్టర్ సుధీర్ షా ప్రహ్లాద్‌ను పరీక్షించారు. ఒక అద్దాల గదిలో ప్రహ్లాద్‌ను పెట్టి సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. చివరికి టాయిలెట్‌ను కూడా మూసివేశారు. పెదాలను తడుపుకోడానికి కొద్దిపాటి నీటినే పెట్టారు. ఇలా ఆయనను 10 రోజులు పాటు పరీక్షించారు. ప్రహ్లాద్ అక్కడ నుంచి కదలకుండా, చుక్క నీరు కూడా తాగకుండా వైద్యులను ఆశ్చర్యపరిచారు. దీంతో ప్రహ్లద్ జీవనశైలి ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *