గిరిజన విద్యలయలలో దారుణం

Opinion Uncategorized

గిరిజన హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్థినిలకు ఎంతమేర రక్షణ ఉంది..?. పేదరికంతో హాస్టళ్లకు వెళ్లి చదువుకుంటోన్న యువతులు సేఫ్‌గానే ఉంటున్నారా..? నో..ఈ ఘటన వింటే ఒళ్లు గగుర్పొడవటం ఖాయం. ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైబల్ మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు గర్బం దాల్చడం అందర్నీ విష్మయానికి గురి చేస్తోంది.

ట్రైబల్ హస్టల్‌లో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పది మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు అధికారులు. అక్కడ పరీక్షల అనంతరం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు.

ఆ పది మందిలో మగ్గురు అమ్మాయులకు ప్రెగ్నెస్సీ టెస్ట్ పాజిటీవ్ రాగా, అందులో ఒకరికి 3 నెలల గర్భిణీ అని తేలింది. హస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆర్‌సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలలే ముందే ఈ విషయం తెలిసినా కూడా..సమాచారం రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *