సౌర్య ముందే వెక్కి వెక్కి ఏడ్చిన దీప!

Videos

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 682 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 683 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 20) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో ముందుగానే మీకోసం.

సౌందర్య, ఆనందరావులు దగ్గరకు ఆవేశంగా వెళ్లిన కార్తీక్.. వాళ్లు చాలా హ్యాపీగా ఉండటం చూసి… ‘మీరు మాత్రం అలానే సంతోషంగా ఉండండి. ఎదరి వాళ్లు ఏం అయిపోయినా పట్టనట్లే ఉండండి’ అంటాడు ఆవేశంగా.. సౌందర్య మాత్రం చాలా కూల్‌గా. ‘ఇప్పుడు ఏం అయ్యిందిరా?’ అంటుంది. ‘ఏమైందా? ఏం అయ్యిందో తెలియదా మమ్మీ.. దాని ఇంటికి నన్ను ఎందుకు లాక్కెళ్లాలి? అసలు దాన్ని ప్రతి సారీ ఎందుకు కలుపుతున్నారు మమ్మీ?’ అంటూ రగిలిపోతాడు. ‘ఒక్కపూట సరదాగా దీప ఇంటికి వెళ్తే తప్పేంట్రా? అక్కడ తింటే తప్పేంట్రా?’ అంటుంది సౌందర్య. వెంటనే కూల్ అయ్యి.. ‘మమ్మీ మనం ముగ్గురం అలా బయటికి వెళ్లి వద్దాం’ అంటాడు.‘ఈ టైమ్‌లో ఎందుకురా?’ అని మొదట వద్దన్నా.. తర్వాత సరే అంటారు ఆనందరావు, సౌందర్యలు. దాంతో కార్తీక్ ఫోన్ తీసుకుని.. ‘ఒక్కనిమిషం మమ్మీ..’ అంటూ ఎవరికో కాల్ చేయబోతాడు. ‘ఈ టైమ్‌లో ఎవరికి రా?’ అంటాడు ఆనందరావు.

‘మౌనితకి.. అంతా కలిసి సరదాగా.. అలా తిరిగి వద్దాం’ అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య.. ‘సరదాగా మేము మౌనితతో తిరిగి రావడం ఏంటీ నాన్‌సెన్స్’ అంటుంది. వెంటనే కార్తీక్.. ‘మరి సరదాగా నేనే దీప ఇంటికి రావడం ఏంటి మమ్మీ?’ అంటూ రివర్స్ అవుతాడు. సౌందర్య షాక్ అవుతుంది. కార్తీక్ మాత్రం ఆగకుండా.. ‘మౌనిత నాకు కేవలం ఫ్రెండ్ అని తెలిసి కూడా మీరు ఆమెని కలుసుకోవడానికి ఇష్టపడ్డంలేదు. అలాంటిది నాతో కాపురం చేసిన అది(దీప) వేరే వాడితో…’ అంటూ ఉండగా..‘కార్తీక్’ అని గట్టిగా అరుస్తుంది సౌందర్య.

సౌందర్య అరుపుల్ని కంట్రోల్ చేస్తూ.. ‘అరవకు మమ్మీ.. హిమ నిద్ర లేస్తుంది. మీరు ఏ నాడైనా నా మనసు గురించి ఆలోచించారా? అసలు నా వయసు ఎంత మమ్మీ? నేను కాపురం చేసింది ఎంతకాలం? నాకు కోరికలు ఉండవా? అయినా సరే మౌనితని కాదు కదా.. మరి ఏ ఆడదాన్నైనా ఆ ఆలోచనలతో చూస్తానా? ఎవరో తెలియని ఓ అనాథను తీసుకొచ్చి.. నా చేతుల్లో పెట్టావ్. దానితోనే నా జీవితం, ఆనందం అనుకుంటూ బతికేస్తున్నాను.

కానీ మీరు మధ్యలో వచ్చి నా ఆనందాన్ని నాశనం చేసి, నా రెక్కలు విరిచేసి.. ఏదో సాధించినట్లుగా విర్రవీగుతారు. ఎందుకు మమ్మీ?’ అంటూ కార్తీక్ తన బాధను చెబుతుంటే కళ్లు చెమర్చకమానవు.కార్తీక్ మాటలను వింటూ కళ్లనిండా నీళ్లతో నిర్ఘాంతపోయి చూస్తున్న సౌందర్య ఆనందరావులు.. వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడరు. కార్తీక్ మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. ‘అసలు నా ఉనికికే అర్థం లేదు. నా మీద నాకే అసహ్యం పుడుతుంది. బతికి ఉన్న శవంలా చేసేస్తున్నారు’ అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

సౌందర్య ఆనందరావులు కొడుకు బాధని చూస్తూనే.. ‘వీడు అనుమానం అనే ఇనుప ఊచలను కప్పుకుని నిద్రపోతున్నాడు..’ అని ఆనందరావు.. ‘నిజమనే నిప్పు ఎప్పటికైనా ఆ ఊచలను కరిగిస్తుంది’ అని సౌందర్య అనుకుంటారు.శ్రావ్య, ఆదిత్యలు దీప ఇంటి నుంచి రావడంతో భాగ్యం చాలా టెన్షన్‌గా.. ‘అక్కడేం జరిగింది? కార్తీక్‌కి దీపకి గొడవ జరిగిందా?’ అంటూ ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది.

అయితే శ్రావ్య మాత్రం చాలా కూల్‌గా అక్కడ జరిగిందంతా చెబుతుంది. అది వింటూనే.. ‘ఈ సీన్‌లో గొడవ జరిగి ఉంటుంది కదా? అప్పుడు కార్తీక్ ఇలా చేసి ఉంటాడు కదా?’ అని గెస్ చేస్తూ కామెడీ పుట్టిస్తుంది భాగ్యం. అయితే శ్రావ్య మాత్రం గొడవ ఏం జరగలేదని, అంతా కూల్‌గా జరిగిందని చెప్పడంతో భాగ్యం డీలాపడిపోతుంది. ‘అయ్యో వీళ్లు ఎప్పుడు విడాకులు తీసుకోవాలి? ఎప్పుడు భరణం రావాలి?’ అంటూ బేరమంటుంది.సౌర్య కార్తీక్ నేమ్ బోర్డ్ తీసుకుని ఇంట్లోకి వచ్చిన సౌర్య.. పైకి ఎక్కి.. ఆ బోర్డ్‌ని దాచే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇంతలో దీప వస్తుందని గమనించి… బీరువాలో చీర కింద పెట్టి.. తలుపు వేస్తుంది. అప్పటికే దీప వచ్చేయడంతో.. ‘అమ్మా ఈ తలుపు పట్టడం లేదు’ అని కవర్ చేస్తుంది. వెంటనే దీప ఆ తలుపు వేయగానే మంచం మీద పడుకుని తల్లిని గమనిస్తుంది.

దీప మంచం మీద కూర్చుని ఆలోచించుకుంటుంది. ‘అమ్మా.. ఇవాళ నువ్వు సంతోషంగా ఉన్నావా?’ అని అడుగుతుంది సౌర్య. ‘మరి నువ్వు సంతోషంగా ఉన్నావా?’ అని అడుగుతుంది దీప.‘నువ్వుంటే అందరికి చాలా ఇష్టం కదమ్మా?’అని అడుగుతుంది సౌర్య. ‘చూశావుగా?’ అంటుంది దీప నవ్వుతూ. వెంటనే సౌర్య దీపకు ముద్దు పెట్టి.. ‘నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి’ అంటుంటే.. దీప మనసులో.. కార్తీక్ వార్నింగ్ తలుచుకుని.. ‘సంతోషంగా బతకడానికి మంచితనం చాలదమ్మా.. అదృష్టం కూడా కలిసి రావాలి’ అనుకుంటుంది. దీప బాధగా కూర్చోడం చూసిన సౌర్య ఏమైందమ్మా అలా ఉన్నావ్?’ అని అడుగుతుంది. ‘అలసిపోయాను కదమ్మా’ అంటుంది దీప మాట మారుస్తూ..దీప మాటలకు ‘అవును.. చాలా పనులు చేశావ్ కదా?’ అని సౌర్య అనగానే..‘అయినా నన్ను ఎవరు పని చేయనిచ్చారు? నాన్నమ్మా, శ్రావ్యా, సరోజక్కా, అరుణ(సరోజ చెల్లి) అంతా తలోపనీ చేశారు’ అంటుంది దీప.

‘అవును.. అంతా చాలా మంచివాళ్లు కదమ్మా?’ అన్న సౌర్య మాటలకు దీప అవును అంటుంది. వెంటనే సౌర్య.. ‘మరి డాక్టర్ బాబూ?’ అని అడగగానే దీప కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. సౌర్య కూడా కార్తీక్ వార్నింగ్‌ని గుర్తు చేసుకుంటుంది. వెంటనే తల్లిని హగ్ చేసుకుంటుంది. దాంతో దీప చెంపల మీద కన్నీళ్లు సౌర్యకు తగులుతాయి. ‘ఏడుస్తున్నావా?’ అని అడుగుతుంది. ‘ఆహాహా.. లేదు అత్తమ్మా.. ఇప్పుడే ముఖం కడుక్కుని వచ్చాను కదా.. ఆ తడి’ అంటుంది దీప కావాలనే ముఖం మొత్తం(కళ్లని) తుడుచుకుంటూ..దీప మాటలకు సౌర్య చిన్నగా నవ్వుతూ.. ‘నేను నిన్ను మంచిగా చూసుకుంటానమ్మా’ అంటుంది. ‘చూసుకుంటూనే ఉన్నావుగా..? అమ్మనే అమ్మలా చూసుకుంటున్నావ్’అంటూ ముద్దులు పెడుతుంది. వెంటనే సౌర్య తన చెంపకు అంటుకున్న తడిని చూసి.. ‘అదిగో ఈ చెంపకూడా తడిగానే ఉంది. నువ్వు ఏడుస్తున్నావ్’ అంటుంది. ఆ మాటలకు దీప దు:ఖాన్ని ఆపుకోలేక.. పైకి ఏడుస్తూ.. ‘అవును.. ఎందుకో ఏడుపు వస్తుంది. ఆగమన్నా ఆగట్లేదు’ అన్న దీప మాటలు వింటే.. వీక్షకుల గుండె ద్రవించకమానదు. ‘ఏడవకు అమ్మా.. నాకూ ఏడుపొస్తోంది..’ అంటూ సౌర్య ఏడుస్తుంటే.. ‘ఏడవను లే అత్తమ్మా.. ఏడువను లే’ అంటూనే బోరున ఏడ్చేస్తుంది దీప.

సౌర్యని గుండెలకు హత్తుకుని బాగా ఏడుస్తుంది.మౌనిత మాత్రం దీప ఇంట్లో వీడియో కాల్‌లో చూసి విజువల్స్ అన్నీ రిపీట్ చేసుకుని చూస్తూ ఉంటుంది. ప్రియమణి వచ్చి.. ‘అమ్మా నీలాంబరి రజనీకాంత్ పెళ్లి వీడియో చూసినట్లుగా అలా చూస్తూనే ఉన్నారా? ఏదైనా మాట్లాడండమ్మా’ అంటూ అడగడంతో.. ‘ఆలోచిస్తున్నా.. ఆ దీపని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను’ అంటుంది. ‘చంపడాలాంటివి ఎప్పటికైనా ప్రమాదమేనమ్మా.. నేరం చేసి తప్పించుకోవడం కష్టం కదమ్మా.. అలా కూకుండా మంచిగానే ఆలోచించండి’ అంటుంది ప్రియమణి. దాంతో మౌనిత.. ‘ఆలోచిస్తాను.. మొత్తం ఆలోచిస్తాను. ఈ మౌనిత ఇకపై ఒంటరిగా మిగిలిపోదు.. కార్తీక్‌తో కలిసి బతుకుతుంది’ అంటుంది. ‘మరి ఆ పని మీద ఉండండి.

మొదట కార్తీక్, దీపల విడాకుల లాయర్‌ని కలవండి’ అంటుంది ప్రియమణి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *