తమన్నా పోస్టర్ రిలీజ్ చేసిన సరిలేరు నికేవ్వరు టీం

Videos

గార్జియస్ బ్యూటీ, సూపర్ టాలెంటెడ్ తమన్నా ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని తమన్నాకు సంబంధించిన ఓ కత్తిలాంటి పోస్టర్‌ను సినిమా టీం అభిమానుల కోసం వదిలింది. ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని తమ్మూ బేబీ తన హాట్ ఫిగర్‌తో పిచ్చెక్కించేస్తోంది. ఈ సినిమాలో తమన్నా మహేష్ బాబుతో కలిసి ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పాట.. ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా’ అనే ఫన్నీ లిరిక్స్‌తో ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం.ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పాటను షూట్ చేశారట.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారట. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

దీంతో ఈ ప్రీ రిలీజ్ వేడుక మెగా సూపర్ ఈవెంట్ కానుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి రావడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఇలాంటి సినిమా ప్రచార వేడుకల్లో ఇప్పటి వరకు వీరిద్దరూ  ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *